Monday 7 October 2013

బతుకు పండిన వేళ

బతుకు పండిన వేళ
ఆనందం ఆర్నవమై
పురివిప్పిన వేళ
అగ్ని గోళంలా
మండుతున్న గుండెలన్నీ
ఒకే గొంతుకై నినదించిన వేళ
పాటలు కోలాటాలై
పోయిన వేళ
వాళ్ళు ఒక్కటై పోతారు
అరమరికలు లేని
నవ్వులతో మనల్ని
మనుషులు చేస్తారు ..!

కోల్పోయిన బంధాలన్నీ
మళ్ళీ పువ్వుల్ల్లా విరబూస్తాయి
మనుషులంటే శరీరాలు కాదని
సాటి వారి పట్ల ప్రేమను
కలిగి ఉండాలని
అదే మనకు నాగరికత
నేర్పిన సత్యమని బోధిస్తారు ..!

ఎక్కడెక్కడో పుట్టి
మరెక్కడో బంధాలతో
మమేకమై పోయిన
ఆడబిడ్డలంతా అలచంద్రవంకలై
మనల్ని ఆలోచింప చేస్తారు
వాళ్ళు పల్లెతనపు ఆనవాళ్ళకు
ప్రతిరూపాలు ..
తరతరాలుగా వస్తున్న
గొప్పనైన సంస్కృతికి
వారసులు ..ప్రాణ దాతలు ..!

ఒక తరం నుంచి
మరో తరానికి మధ్యన
గీసిన గీతను
చెరిపి వేసిన ఆణిముత్యాలు
ఈ అచ్చమైన మట్టితనపు
ఆడబిడ్డలు ..!

చేతులు కొమ్మలవుతాయి
పాదాల సవ్వడులు
పుడమి తల్లిని ముద్దాడుతాయి
జనం జాతరై పోతారు
బతుకమ్మలై ఆడుతారు ..!

తల్లులారా మీకు
వందనం
బతుకమ్మలారా
మీకు దండం ..!!
 
By--palamuru bhaskar
 
https://www.facebook.com/palamuru.bhaaskar

No comments:

Post a Comment