Sunday 6 October 2013

మట్టి బిడ్డలారా !!!!!!

మట్టి బిడ్డలారా
తెలంగాణా మాగాణంలో
మొలిచిన మొక్కలారా
నేలలో పుష్పించిన
తల్లులారా
తనివి తీరా ఆడండి
అలసి పోయే దాకా
తనువులు ఉప్పొంగే దాకా
బతుకమ్మలై ఆడుతూనే ఉండండి ..!

మన సంసృతికి
ప్రాణం పోయండి
మన సాంప్రదాయాన్ని
తర తరాలుగా
ఎన్నో ఏళ్ళ నుంచి
కాపాడుకుంటూ వస్తున్న
మన బతుకమ్మను
కాపాడుకుందాం ..!

అదుగో తెలంగాణా తల్లి
మిమ్మల్ని చూసి
ఆనంద పడుతున్నది
గోదావరి ..క్రుష్ణమ్మలై
ప్రవాహమై ఈ మట్టి దద్దరిల్లేలా
పుడమి డమరుకమై మోగేలా
నింగిలో తారకలై
ఎగసి పడుతూ
ఫిరంగులై కదలండి
బతుకమ్మలై పాడండి
తెలంగాణా మాగానమై
దుమ్ము రేపండి ..!
By..Bhaskar Palamuru

No comments:

Post a Comment