Sunday, 6 October 2013

జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం



జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం
ముక్కొటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తర తరాల చరితగల తల్లీ నీ రాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ, జై జై తెలంగాణ.....!!


పోతన ది పురిటి గడ్డ, రుద్రమ దీ వీర గడ్డ
గండర గండ్రడు కొమురంభీముడే నీ బిడ్డ
కాకతీయ కళా ప్రభల, కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల, గొప్పవెలుగె చార్మినార్
జై తెలంగాణ, జై జై తెలంగాణ.....!!

జానపద, జనజీవన జావలీలు జాలువార
కవిగాయక, వైతాలిక కళలా మంజీరాలు
జాతిని జాగ్రుత పరిచే గీతాల జన జాతర
అను నిత్యం నీ గాణం, అమ్మ నీవె మా ప్రాణం
జై తెలంగాణ, జై జై తెలంగాణ.....!!

సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద, సక్కనైన పువ్వుల పొద
సిరులు పండె సారమున్న మాగానియె కద నీ యెద
జై తెలంగాణ,జై జై తెలంగాణ...!!

గోదావరి, క్రిష్ణమ్మలు మన భీల్లకు మల్లాలి
పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి
స్వరాష్టమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి
జై తెలంగాణ, జై జై తెలంగాణ...!!

you can download/see this video song here Click here to See

No comments:

Post a Comment